వైరల్ వీడియో: నడవలేని స్థితిలో కాంబ్లి

Home >>> వైరల్ > వైరల్ వీడియో: నడవలేని స్థితిలో కాంబ్లి

news-details

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ లో ఒక వెలుగు వెలగాల్సిన కాంబ్లి ఇప్పుడు అత్యంత  దయనీయ స్థితిలో ఉన్నాడు. తాజాగా బయటకు వచ్చిన ఒక వీడియో అతని అభిమానులను కన్నీరు పెట్టించింది. ఈ వీడియోలో కాంబ్లీ సరిగ్గా నడవడానికి కూడా కష్టపడుతున్నట్లుగా ఉంది. స్థానిక ప్రజలు అతనికి సపోర్ట్ గా నిలిచి రోడ్డు దాటించారు. 

https://x.com/binugazi/status/1820646175105499558

కాంబ్లీ భారత్ తరఫున 100కు పైగా వన్డేలు, 17 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దాదాపు 10 వేల పరుగులు చేశాడు. కాంబ్లి జీవితం ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి. వచ్చిన స్టార్ ఇమేజ్ ని అతను సరిగా వాడుకోలేక ఇబ్బందులు పడ్డాడు. ఎక్కువ మొత్తంలో ఆదాయం రావడంతో కాంబ్లి ఇతర అలవాట్లకు బానిస అయ్యాడనే విమర్శలు ఉన్నాయి. ఇక అతని కెరీర్ ముందుకు వెళ్లకపోవడానికి సచిన్ కూడా ఒక కారణం అంటూ ఉంటారు.

You can share this post!