సినిమా చెట్టు కూలిపోయింది, 300 సినిమాలు షూట్ ఈ చెట్టు కిందే...!

Home >>> వైరల్ > సినిమా చెట్టు కూలిపోయింది, 300 సినిమాలు షూట్ ఈ చెట్టు కిందే...!

news-details

సినిమా చెట్టు కూలిపోయింది 150 ఏళ్ళ చరిత్ర ఉన్న నిద్ర గన్నేరు చెట్టు ప్రకృతి వైపరిత్యానికి నేలకొరిగింది. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఉన్న చెట్టు కింద దాదాపు 300 లకు పైగా సినిమాలను షూట్ చేసారు. గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఇక్కడే షూట్ చేసారు. పాడి పంటలు, మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు, ఆపద్బాందవుడు, నువ్వు లేక నేను లేను, రంగస్థలం సహా ఎన్నో సినిమాలు ఈ  చెట్టు కింద షూటింగ్ జరుపుకున్నాయి. 

గోదావరి జిల్లాల్లో ఒక చెట్టు షూటింగ్ జరుపుకుంది అంటే కచ్చితంగా ఈ చెట్టు ఉంటుంది. అగ్ర దర్శకులు దాసరి, విశ్వనాథ్, బాపు, కృష్ణవంశీ, వంశీ , సుకుమార్ సహా ఎందరో ఇక్కడ తమ సినిమాల్లో అందమైన సన్నివేశాలను షూట్ చేసారు. అగ్ర  హీరోల సినిమాలు అన్నీ ఇక్కడ  దాదాపుగా షూట్ చేసారు. అయితే ఈ చెట్టుని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితో ఆదివారం రాత్రి కూలిపోయింది. ఇలా ఎన్నో సినిమాలకు, ఎంతో సందడి వాతావరణానికి వేదికగా నిలిచిన ఈ  చెట్టు కూలిపోవడం స్థానిక ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది.

You can share this post!