Home >>> వైరల్ > గంటలో 17 మందిని కరిచిన పిచ్చి కుక్క
ఉత్తర ప్రదేశ్ లో ఒక పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. గోరఖ్‌పూర్‌లో ఒక గంటలో చిన్న పిల్లలు, అలాగే మహిళలతో సహా 17 మందిపై దాడి చేసింది, ఆగస్ట్ 14న జరిగిన ఈ ఘటన సంచలనం అయింది. 22 ఏళ్ల విద్యార్థి తన ఇంటి బయట తన ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కుక్క తీవ్రంగా అతనిపై దాడి చేయడం అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో రికార్డు అయింది. గోరఖ్‌పూర్‌లోని షాపూర్ కి చెందిన బీబీఏ విద్యార్థి బుధవారం రాత్రి 9.45 గంటలకు ఫోన్‌లో మాట్లాడుతుండగా అతనిపై కుక్క దాడికి దిగింది.
ఆశిష్ వెనక్కు వెళ్లి కుక్కను అడ్డుకునే ప్రయత్నం చేసినా అది అరుస్తూ దాడి చేయడం రికార్డు అయింది. కాళ్ళు, ముఖం, ముఖంపై దాడికి దిగింది కుక్క. ఆ వెంటనే రేబిస్ వ్యాక్సిన్ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వ్యాక్సిన్ అందుబాటులో లేదని చెప్పారని ఆశిష్ తండ్రి విజయ్ యాదవ్ తెలిపారు. కుక్కల తరుచుగా దాడి చేస్తున్న ఘటనపై నగరపాలక సంస్థకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు చెబుతున్నారు.
గోరఖ్‌పూర్ అదనపు మున్సిపల్ కమీషనర్ దుర్గేష్ మిశ్రా మాట్లాడుతూ, ఈ సంఘటన గురించి తనకు తెలియదని, ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ కోసం నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నామని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నామని, వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజ్ చేయడంతోపాటు పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.