సర్వత్రా ఉత్కంఠ.. ఆ గుడ్ న్యూస్ ఎవరికో...?

Home >>> ఆంధ్రప్రదేశ్ > సర్వత్రా ఉత్కంఠ.. ఆ గుడ్ న్యూస్ ఎవరికో...?

news-details

ముహూర్తం దగ్గర పడింది. సమయం ఆసన్నమైందని టీడీపీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు, నేతలకు క్లారిటీ ఇచ్చేశారు. ఈ నెల 26 తర్వాత నామినేటెడ్ పదవుల ప్రకటన ఉంటుందని కార్యకర్తలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో తేల్చి చెప్పేశారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. పదవులు వీరికే అంటూ సోషల్ మీడియాలో పలు జాబితాలు ట్రోల్ అవుతుండటంతో... కొందరు నేతల్లో టెన్షన్ తారాస్థాయికి చేరుకుందనేది వాస్తవం. అసలు పదవి వస్తుందా.. రాదా అనే అభద్రతా భావన కూడా కొందరు నేతల్లో పెరిగిపోతోంది. ఇన్ని రోజులు పడిన కష్టాన్ని అధినత గుర్తించారో లేదో అనే భయం మరికొందరిది. 

తాజాగా పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు సుమారు 75 వేల మందికి లింక్ పంపగా... కేవలం 15 వేల మంది కార్యకర్తలు మాత్రమే కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారికేమైంది అని బాబు ఆరా తీయగా... అసలు విషయం బయటపడింది. కొందరు నేతలు కాన్ఫరెన్స్‌లోనే అధినేతను గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ... తమకు సరైన గుర్తింపు లేదని కొందరు... చివరికి వైన్ షాప్ టెండర్లల్లో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని మరికొందరు అసహనం వ్యక్తం చేశారట. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలపై సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కొందరు నేతలు నిలదీసినట్లు తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పదవుల ప్రకటన ఉంటుందో... లేదో తెలియని స్థితిలో నేతలున్నారని... అసలు పదవి వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నట్లు కూడా బాబు దృష్టికి నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం. 

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం... నామినేటెడ్ పదవుల ప్రకటనపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 26తో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత రోజే పదవుల ప్రకటన ఉంటుందని చెప్పినట్లు నేతలు వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, సీట్లు త్యాగం చేసిన వారికి, చంద్రబాబుకు అంతరంగికంగా అన్ని  విధాలుగా అండగా ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. 20 మందితో కూడిన తొలి జాబితాలో జనసేన, బీజేపీ నేతలు కూడా ఉంటారని... అక్టోబర్ నెల చివరి వారంలో బీసీ కార్పోరేషన్ పదవుల ప్రకటన ఉంటుందనేది పార్టీ నేతల మాట. కీలకమైన టీటీడీ ఛైర్మన్, ఏపీ ఐఐసీ, మహిళా కమిషన్, ఫుడ్ కార్పొరేషన్, ఆర్టీసీ ఛైర్మెన్ లాంటి ప్రోటోకాల్ పదవులు తొలి దఫాలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ గుడ్ న్యూస్ ఎవరికి వస్తుందో అని నేతల్లో సర్వంత్రా ఉత్కంఠ నెలకొంది.

You can share this post!