Home >>> భక్తి > తాబేలును ఇంట్లో పెంచుకుంటే ఈ ప్రమాదం తప్పదా ?
ఎన్నో రోజుల నుంచి చాలా మంది తాబేలును ఇంట్లో పెంచుకుంటున్నారు. అయితే... నిజంగా తాబేలుని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఏదైనా పక్షిని కానీ జంతువుని కానీ అలా మనం ఉంచేయకూడదు. మనకి అలా బంధించే అధికారం కూడా లేదు. ఏ జీవులని కూడా బంధించకూడదు. అలా ఇంట్లో తాబేలు పెడితే నెగటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఒకవేళ కనుక మీరు ఇంట్లో తాబేలు పెట్టుకోవాలంటే చెక్కతో లేదంటే క్రిస్టల్ తో, మెటల్ తో చేసిన వాటిని పెట్టుకోవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం శుక్రవారం, గురువారం, బుధవారం తాబేళ్లను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడానికి మంచిది. ఇంట్లో తాబేలు విగ్రహాలు లేదంటే ఫోటోలు ఉండడం వలన ఎంతో మేలు కలుగుతుంది. ఉత్తరం వైపు క్రిస్టల్ తాబేలు లేదంటే ఇతర మెటల్స్ తో చేసిన తాబేలు పెడితే మీరు మేలు జరుగుతుంది. కెరియర్ బాగుంటుంది. ఇంటి ముఖద్వారం దగ్గర పెడితే కూడా ఎంతో మేలు కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చాలామంది లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ తాబేళ్లను ఇంట్లో పెట్టుకుంటే చక్కటి లాభాన్ని పొందొచ్చు.