పిల్లల ముందు పేరేంట్స్‌... అస్సలు చేయకూడని పనులు ఏంటో మీకు తెలుసా...?

Home >>> భక్తి > పిల్లల ముందు పేరేంట్స్‌... అస్సలు చేయకూడని పనులు ఏంటో మీకు తెలుసా...?

news-details

ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణ రాహిత్యంతో అసలు ప్రవర్తించకూడదు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణగా తీసుకొని మెదులుతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి అబద్ధం చెప్పమని పిల్లలను అడుగుతారు. పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారంటే భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు.

తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెప్పడమే ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ తప్పుడు పదాలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా పెద్దవారి మాటలని అనుసరిస్తారు. కాబట్టి వాళ్లు అవి నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దంపతుల మధ్య గొడవలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ, దెబ్బలాడుతూ ఉంటారు. ఈ సమయంలో భర్త భార్యను అవమానిస్తారు. అలాగే భార్య భర్తను అవమానిస్తుంది. ఇదంతా పిల్లల ముందే చేయడం వల్ల పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి.

You can share this post!