Home >>> భక్తి > జాతకం ప్రకారం... మంగళవారం పుడితే ఏం జరుగుతుంది... ఆ ప్రమాదం తప్పదా!
వారంలో మూడవ రోజు అయిన మంగళవారంకు అధిపతి అంగారక గ్రహం. ఈ గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఆ గ్రహ ప్రభావం మంగళవారం పుట్టిన వ్యక్తులపై ఎక్కువ ఉంటుంది. మంగళవారం పుట్టడం గొప్ప వరమని చెబుతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు వరంగా చెబుతారు. పోరాట స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రోజున పుట్టిన వారు గొప్ప మేధస్సు కలిగి ఉంటారు. ఈ రోజున ఆ గొప్ప వ్యక్తిత్వం కలవారు పుడతారు. గొప్ప ఆధ్యాత్మికవేత్తలు మంగళవారం నాడు పుడుతుంటారు.
మంగళవారం జన్మించిన వారు తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు. సహాయం చేయడంలో ముందుంటారు. దానధర్మాలు చేయడంలో ముందుంటారు. వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తుంటారు. మంగళవారం జన్మించిన వారికి ఓపిక, సహనం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంపాదించడం మొదలుపెట్టిన చిన్న వయసులోనే లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. మంగళవారం పుట్టిన వారు ముఖ్యంగా స్త్రీలు అమ్మవారి ఆరాధన చేయాలి. మంగళవారం పుట్టిన స్త్రీలు ఎంత శాంతంగా ఉంటే ఆ కుటుంబం అంత వృద్ధిలోకి వస్తుంది.