Home >>> భక్తి > భార్యతో పాటు ఈ నాలుగు ఈ రహస్యాలు ఎవరికీ చెప్పొద్దు..!
మగవాళ్ళకు బిగ్ అలర్ఠ్. మగవాళ్ళు ఈ నాలుగు విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదట. భార్యకి కూడా వీటిని అస్సలు చెప్పకూడదు అని ఆచార్య చానాక్య నీతి ద్వారా తెలిపారు. మగవారి జీవితంలో వచ్చే ఆర్థిక ఇబ్బందుల గురించి అస్సలు ఎవ్వరికి చెప్పకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పటికీ వాటిని ఇతరులతో పంచుకోవద్దు. ఆర్థిక పరిస్థితి గురించి, ఆర్థిక ఇబ్బందులు గురించి భార్యకి కూడా మగవాళ్ళు చెప్పుకోకూడదు. అలానే డబ్బులు పోయినా సరే మగవాళ్ళు భార్యకి చెప్పకూడదు. నిజానికి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారని ఎవరికైనా చెప్తే ఎవరూ సహాయం కూడా చేయరు.
మగవాళ్ళు భార్య గురించి ఎప్పుడూ ఇతరులకు చెప్పుకోకూడదు. భార్యకు సంబంధించిన రహస్యాలను షేర్ చేసుకోకూడదు. అలానే మగవాళ్ళు వ్యక్తిగత సమస్యలను కూడా ఇతరులతో చెప్పుకోకూడదు. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు ఎవరికైనా చెప్తే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతారు. దాంతో తిరిగి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అవమానానికి గురి అయితే దానిని కూడా ఎవరికీ చెప్పకూడదు. భార్యతో కూడా ఆ విషయాన్ని చెప్పకూడదు. ఒకవేళ చెప్పారంటే మానసికంగా కృంగిపోవాల్సి వస్తుంది.