ఆషాఢ మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు..?

Home >>> భక్తి > ఆషాఢ మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు..?

news-details

ఆషాడమాసం గురించి తెలియని వారుండరు. ఆషాడమాసం అంటే తొలకరి జల్లులు కురిసే మాసం. ఆ రోజుల్లో అన్ని వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు ఉండేవి. కాబట్టి ఈ మాసంలో అందరూ పొలం పనుల్లో బిజీగా ఉండేవారు. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన యువకుడు ఈ కాలంలో పొలం పని చేయడం కంటే ఇంట్లో ఉండడానికి ఆసక్తి చూపిస్తాడు. అందుకే భార్యాభర్తల మధ్య ఈ సమయంలో ఎడబాటు ఉండాలన్నారు. అత్త కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అన్నారు కదా అని... అల్లుడు వెళ్లి అత్తగారింట్లో కూడా ఉండకూడదు అని చెప్పేవారు. ఎందుకంటే వారికి కూడా పొలం పనులు ఉంటాయి కాబట్టి.

మరొక కారణం ఏంటంటే... ఆషాడ మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. ఈ సమయంలో కలిసే జంటలకు స్వామివారి ఆశీస్సులు అందవు. అందుకే ఆషాడమాసంలో దంపతులు కలవకూడదనే ఉద్దేశంతో ఈ నియమం పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆచారానికి ఓ శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. ఆషాడ మాసంలో దంపతులు కలిస్తే పురుడు వచ్చే సమయానికి వేసవికాలం వస్తుంది. మండుటెండల్లో... ఆసుపత్రులు అంతగా లేని ఆ రోజుల్లో... అది ప్రాణాంతకంగా భావించేవారు. అందుకే, ఆషాడమాసం, ఆ తర్వాత శ్రావణమాసం నోములు అని చెప్పి... ఆ రెండు నెలలు ఆడపిల్లలను పుట్టింట్లోనే ఉంచేవారు. ఇన్ని రకాలుగా ఆలోచించే ఈ నియమాన్ని తీసుకువచ్చారు. అందుకే పెద్దలు ఏమి చెప్పినా అది మన మంచికే అని అర్థం చేసుకోవాలి.

You can share this post!