నందమూరి చైతన్య కృష్ణ హీరోగా కొత్త సినిమా..!!!

Home >>> సినిమా > నందమూరి చైతన్య కృష్ణ హీరోగా కొత్త సినిమా..!!!

news-details

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'నందమూరి' వంశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉన్న సంగతి సినీ జగమెరిగిన సత్యం. స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికే కాదు యావత్ తెలుగు చలన చిత్ర సీమకే అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చారు. ఒక సినిమా నటుడిని దేవుడిగా కొలిచే పద్ధతికి బీజం పడింది ఆయనతోనే. 

ఆ మహనీయుని వారసత్వాన్ని మొయ్యడం అనేది ఏ నటుడికైనా అతిపెద్ద సవాల్. అటువంటి పరిస్థితుల్లోనే నందమూరి బాలకృష్ణ నందమూరి నట వారసత్వాన్ని ఏమాత్రం బెడిసికొట్టకుండా హుందాగా కాపాడుతూ వచ్చారు. ఇక ఎన్టీవోడి మనవడు చిన్న ఎన్టీవోడు కూడా ఆ వారసత్వాన్ని మరింత గొప్పగా ప్రపంచస్థాయిలో నిలబెట్టాడు.

నందమూరి వంశం నుండి హరిక్రిష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్న వచ్చినప్పటికీ బాలయ్య ఎన్టీఆర్ కు వచ్చినంత స్థాయిలో గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇప్పుడు నందమూరి వంశం నుండి మరో కొత్త హీరో తెరంగేట్రం చేయబోతున్నాడు. అతనే నందమూరి చైతన్య కృష్ణ. 

దర్శకుడు వంశీకృష్ణ చైతన్య కృష్ణని ఎంతో ప్రతిష్టాత్మకంగా వెండితెరకు పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అతని మొదటి సినిమాని వారి సొంత బ్యానర్ అయిన బసవతారకరామ బ్యానర్‌ ద్వారా ప్రేక్షకులకు అందించనున్నట్టు చిత్ర బృందం తాజాగా వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ ను మార్చ్ 5న అనౌన్స్ చేస్తామంటూ ఒక పోస్టర్ వదిలారు.

అయితే ఇప్పటి వరకూ నందమూరి ఫ్యామిలి నుండి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే అందరూ ఎదురుచూస్తున్నారు కానీ చైతన్య కృష్ణ హీరోగా వస్తాడనే ఆలోచన ఎవరికీ లేదు. ఈ సడన్ సర్ప్రైజ్ చూసిన నందమూరి అభిమానులు మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు.

You can share this post!