Home >>> సినిమా > ఆ ఇద్దరు హీరోల మధ్య సినిమా తెచ్చిన తంటాలు...!
టాలీవుడ్లో నందమూరి, మెగా హీరోల మధ్య పోటీ తొలి నుంచి నడుస్తోంది. ఇక నందమూరి, మెగా అభిమానుల మధ్య కూడా అదే స్థాయిలో అదే స్థాయిలో యుద్ధం నడుస్తుంది. చివరికి ఈ పోటీ కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి చేరుకుందనేది వాస్తవం. రెండు కుటుంబాలకు చెందిన ప్రముఖ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి ఎన్నో కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు... ఇక వీరిద్దరి వారసులు ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులు... వీరిద్దరు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక మెగా సోదరుడు పవన్ కల్యాణ్.. నందమూరి అల్లుడు చంద్రబాబుతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. నందమూరి, మెగా కుటుంబాలు కలిసే ప్రస్తుతం ఏపీలో రాజకీయ చక్రం తిప్పుతున్నాయనేది కూడా వాస్తవం.
అయినా సరే... అభిమానుల మధ్య ఇప్పటికీ తమ హీరోనే గొప్ప అనే పోటీ తత్వం మాత్రం పోలేదు. ఇదే విషయం మరోసారి రుజువైంది. అది కూడా ఓ సినిమా ద్వారా ఆ చిచ్చు రాజుకుంది. నార్నే నితిన్ హీరోగా నటించిన సినిమా ఆయ్. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఇక సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. బిగ్ స్క్రీన్ మీద కంటే... ఓటీటీలోనే ఆహా ఎక్కువ రికార్డులు సృష్టిస్తోంది. కామెడీ మస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదే సమయంలో ఆయ్ సినిమాలోని ఓ సన్నివేశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కుల పిచ్చి పీక్స్ అంటూ చెప్పే ఓ సీన్లో హీరోయిన్ తండ్రి వీరయ్య వెనుక ఆదిత్య 369లో శ్రీ కృష్ణదేవరాయలు గెటప్‌లో ఉన్న బాలకృష్ణ కటౌట్ చూపించారు.. వీరయ్యకు తిరుగే లేదు అని గొప్పగా ఎలివేషన్ కూడా ఇచ్చాడు దర్శకుడు. అయితే వీరయ్యను కొట్టిన ఒకే ఒక్క మగాడు బూరయ్య అంటూ హీరో తండ్రి క్యారెక్టర్‌ను చూపించాడు. ఆయితే ఆ చూపించే సమయంలో ఖైదీ సినిమాలో చిరంజీవి కటౌట్ వేసేశాడు. ఇదే నందమూరి, మెగా అభిమానుల మధ్య చిచ్చుకు కారణమైంది. మా హీరో కింగ్ అని.. కాదు మా హీరో సూపర్ అని... సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. సినిమా మీద నుంచి... క్రమంగా కులాలపై కూడా కొందరు వ్యక్తిగత కామెంట్లు చేసుకునే స్థాయికి ఈ మాటల యుద్దం చేరుకుంది. మరి ఈ ఫ్యాన్ వార్‌కు నందమూరి, మెగా హీరోలు ఎలా బ్రేక్ చెప్తారో వేచి చూడాలి.