దేవర సెకండ్ సింగిల్ సూపర్ సక్సెస్, యూట్యూబ్ లో రికార్డులు...!

Home >>> సినిమా > దేవర సెకండ్ సింగిల్ సూపర్ సక్సెస్, యూట్యూబ్ లో రికార్డులు...!

news-details

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర చిత్రం ఫ్యాన్స్ లో రోజు రోజుకి హైప్ పెంచేస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయిన పాట కూడా ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చేసింది. స్క్రీన్ పై ఎన్టీఆర్ తో జాన్వీ సెట్ అవుతుందో లేదో అనే భయాన్ని ఈ పాట తో చిత్ర యూనిట్ పోగొట్టింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలానే కనపడుతోంది. నేడు విడుదలైన పాట ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. చుట్టమల్లే చుటేస్తాంది.. తుంటరి చూపు.. ఉరికే ఉండదు కాసేపు అనే పాటను నేడు విడుదల చేసారు. 

కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27 న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక విడుదలైన రెండు గంటల్లో ఈ పాటను 2 మిలియన్ల మంది చూసారు తెలుగులో. బీచ్ లో షూట్ చేసిన ఈ పాటలో జాన్వీ కపూర్ ను చాలా అందంగా చూపించారు. ఇక పాట లిరిక్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

You can share this post!