Home >>> సినిమా > శోబిత-చైతూ నిశ్చితార్ధం నేడే, ఎక్కడంటే...?
టాలీవుడ్ హీరో నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్ళ నేడు నిశ్చితార్ధం చేసుకోనున్నారు. నాగ చైతన్య ఇంట్లో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్ధం జరగనున్నట్టు తెలుస్తోంది. సమంతాతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభిత తో ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వీరు వివాహానికి సిద్దమయ్యారు. 2021 లో సమంతాతో నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాతి నుంచి సింగిల్ గా ఉంటున్న నాగ చైతన్య ఎట్టకేలకు రెండో వివాహం చేసుకోనున్నాడు. ప్రస్తుతం వీరు ఇద్దరూ కలిసే ఉంటున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సమంతాతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య సినీ కెరీర్ అంత గొప్పగా ఏం లేదనే సంగతి తెలిసిందే. అయితే సమంతా మాత్రం సినిమాల్లో బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ లో ఆమె చేసిన వెబ్ సీరీస్ విడుదల కానుంది. హనీ బన్నీ అనే టైటిల్ తో ఆమె వెబ్ సీరీస్ లో నటించింది.