Home >>> పాలిటిక్స్ > కేటిఆర్ పై దారుణంగా రేవంత్ విమర్శలు
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు అంటూ విరుచుకుపడ్డారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు అన్నారు రేవంత్.
అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి అంటూ సవాల్ చేసారు. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అంటూ మండిపడ్డారు. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు... బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకె పరిమితం అన్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు అన్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది అని స్పష్టం చేసారు రేవంత్ రెడ్డి.