Home >>> పాలిటిక్స్ > విజయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం...?
ఐ అండ్ పీఆర్ మాజీ కమీషనర్ విజయ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక సమర్పించారు. వైకాపాతో అంటకాగి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యా దులు ఎదుర్కొంటున్న ఆయనపై ఆరోపణలు రావడంతో విచారణ చేయించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి గత అయిదే ళ్లలో ఆయన పలు అవకతవకలకు పాల్పడ్డారని, నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో ప్రస్తావించారని తెలుస్తోంది.
ప్రధానంగా ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి అవలంబించడం ఒకటి అయితే వైకాపా సామాజిక మాధ్యమ విభాగాల్లో పనిచేసే వారికి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లిం చటం, నిధుల దారి మళ్లింపు తదితర అంశాలపై నివేదికలో పొందుపరిచినట్లు విచారణలో గుర్తించారు. విజయ్ కుమార్‌రెడ్డితో పాటు మరికొందరు అధికారుల ప్రమేయంపైనా నివేదికలో వివరాలు పొందుపరిచారు.