ఏపీ నుంచి రాజ్యసభకు గులాబీ నేత...? బిజెపి భారీ ఆఫర్...?

Home >>> పాలిటిక్స్ > ఏపీ నుంచి రాజ్యసభకు గులాబీ నేత...? బిజెపి భారీ ఆఫర్...?

news-details

తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కీలక అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కమలం పార్టీ పెద్దలు. వచ్చే ఎన్నికల నాటికి కొందరు కీలక నేతలను భారత రాష్ట్ర సమితి నుంచి ఎలాగైనా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గులాబీ పార్టీ అగ్ర నేతకు గాలం వేసినట్టుగా సమాచారం. 

అలాగే ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి నాయకులకు భారీ ఆఫర్లు ఇస్తునట్టుగా తెలుస్తుంది. ముందుగా ఆర్ధికంగా బలంగా ఉండే నాయకుల మీద ఆ పార్టీ దృష్టి పెట్టింది అనే సమాచారం కేసీఆర్ ను కంగారు పెడుతున్న అంశం. ప్రస్తుతం కాంగ్రెస్ వైపు కొందరు నాయకులు చూస్తున్న నేపధ్యంలో బలమైన నాయకులను ఎలా అయినా సరే తమ పార్టీలోకి తెచ్చేందుకు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఏకంగా ఒక కీలక నేతకు రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్టుగా సమాచారం. 

ఆంధ్రప్రదేశ్ నుంచి సదరు నేతను రాజ్యసభకు పంపే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే నేతకు కాంగ్రెస్ కూడా ఆఫర్ ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీని మీద ఇంకా స్పష్టత రావడం లేదు. మాజీ మంత్రి కేటిఆర్ మాత్రం వారిని కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా వారు వినడం లేదని అంటున్నారు. ఈ పరిణామాలు అన్నీ కూడా ఇప్పుడు గులాబీ బాస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

You can share this post!