Home >>> అంతర్జాతీయం > మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా...?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఏ వైపు నుంచి చూసినా యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత టెహ్రాన్‌లో హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్యకు గురికావడం ఇరాన్ అవమానంగా భావిస్తోంది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో వైమానిక దాడిలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను హతమార్చిన ఒక రోజు తర్వాత హనియే హత్య (జూలై 31న) జరిగింది.
దీనితో ఇప్పుడు ఇరాన్ ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. హమాస్ ఉగ్రవాదులు 12,000 మంది ఇజ్రాయెల్‌లను చంపి, 250 మందిని అపహరించిన తర్వాత నుంచి ఈ ఘర్షణ వాతావరణం మొదలయింది. ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ భారీ దాడులు చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటుగా గాజాలో ప్రత్యక్షంగా దాడులకు దిగడంతో 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
కాల్పుల విరమణ గురించి చర్చలు జరిగాయి, కానీ ఉపయోగం లేకుండా పోయింది. జూలై 28న ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్‌పై రాకెట్ దాడి 12 మంది యువకులను చంపిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. అయితే జూలై 31న టెహ్రాన్‌లో హనియే హత్యకు గురయిన తర్వాత ఇజ్రాయిల్ ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఈ హత్యను ఇజ్రాయెల్ ఖండించడం గాని బాధ్యత వహించడం గాని చేయలేదు. దీనితో ఈ హత్యను మోస్సాద్ చేసినట్టుగా ఇరాన్ భావిస్తోంది. దీనితో ఇప్పుడు యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.