లైంగిక దాడుల్లో బాధితులు బాలురే !

Home >>> క్రైమ్ > లైంగిక దాడుల్లో బాధితులు బాలురే !

news-details

పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. చిన్నారులపై దాడులు, లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగిపోతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా బాధితుల్లో ఎక్కువగా అబ్బాయిలే ఉండటం గమనార్హం. ఒక్క పంజాబ్ ప్రావిన్స్ లోనే ఈ ఏడాది తొలి 5 నెలల్లో నమోదైన వేధింపుల కేసుల్లో 70% మంది బాలురే ఉన్నట్లు తెలిపింది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి పాకిస్తాన్ లోని పంజాబ్ హోమ్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. బాధితుల్లో అత్యధిక శాతం బాలురే ఉన్నట్లు అందులో వెల్లడైంది.

పంజాబ్ ప్రావిన్స్ లో ఈ ఏడాది జనవరి-మే మద్యకాలంలో చిన్నారులపై వేధింపులకు సంబంధించి 1,400 ఘటనలు నమోదు కాగా, అందులో 965 బాలురే ఉన్నారని తెలిపింది. మిగతా 30% బాలికలు ఉన్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయని... పితృస్వామ్య, పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతల వంటివి చిన్నారులపై ఇటువంటి దాడులకు కారణం అవుతున్నాయని పాకిస్తాన్ పత్రిక డాన్ కథనం పేర్కొంది.

You can share this post!