ఇకపై డాక్టర్‌ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. !

Home >>> అంతర్జాతీయం > ఇకపై డాక్టర్‌ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. !

news-details

ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో గర్భనిరోధక మాత్రల విక్రయానికి సంబంధించి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మందుల చీటి అవసరం లేకుండానే 'ఓపిల్' అనే రకం గర్భనిరోధక మాత్రలను నేరుగా ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుమతించనున్నట్లు గురువారం ప్రకటించింది. 'ఓపిల్' ను పెరిగో అనే ఔషధ కంపెనీ తయారుచేస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఆ మాత్రలు మందుల షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి.

వయసుతో సంబంధం లేకుండా మహిళలు, బాలికలు ఎవరైనా సరే వాటిని కొనుగోలు చేయొచ్చని అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే ఓ గర్భనిరోధక అవసరాన్ని విక్రయించేందుకు అనుమతి లభించడం ఇదే తొలిసారి. ఆ దేశంలో ఏటా సగటున 60 లక్షల గర్భధారణలు జరుగుతున్నాయని.... అయితే వాటిలో 45% వరకు అవాంఛితమైనవేనని అంచనా. గర్భనిరోధక ఔషధాల లభ్యతను పెంచాలంటే మహిళలు, టీనేజీ బాలికలు నుంచి కొన్నేళ్లుగా డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

You can share this post!