Home >>> క్రైమ్ > భర్త సెక్స్ అఫైర్స్ భరించలేక.. చివరికి సీన్ రివర్స్
రోజు రోజుకు అక్రమ సంబంధాలతో జీవితాలు అంధకారమయవుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. అక్రమ సంబంధాలు చివరికి విషాదంతాలుగా మిగులుతున్నాయి. అలాంటి ఘటనే ఇది. వేర్వేరు మతాలతో ఉన్న ప్రేమ జంట ఒక్కటైంది. భార్య కోసం భర్త మతం మార్చుకున్నాడు. కొన్ని రోజు సాఫీగా సాగిన వారి దాంపత్య జీవితంలో అక్రమ సంబంధం పురుడు పోసుకుంది. పలువురు మహిళలతో భర్త లైంగిక సంబంధం పెట్టుకున్నాడని రంజాన్‌కు తెలిసింది.. దీంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని వేదసందూరు ప్రాంతంలో వడివేలు (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వేదసందూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్పిన్నింగ్ మిల్లులో వడివేలు 14 సంవత్సరాల క్రితం పనిచేసేవాడు. అయితే..వడివేలులో పాటు అక్కడే పని చేసిన తమిళనాడులోని అరవకురిచ్చికి చెందిన సైబుదీన్, ఫాతిమా దంపతుల కుమార్తె రంజాన్ (36) అనే యువతితో వడివేలు ప్రేమలో పడ్డాడు. ఒకేచోట పని చేస్తున్న వడివేలు, రంజాన్ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే.. రంజాన్‌ను వడివేలు గాఢంగా ప్రేమించాడు.
12 ఏళ్ల క్రితం రంజాన్‌ను వడివేలు వివాహం చేసుకున్నాడు. హిందూ మతంలోకి మారడానికి రంజాన్ నిరాకరించింది. అయితే వడివేలు ఇస్లాం మతం స్వీకరించి అతని పేరును మహమ్మద్ అబూబకర్ సిద్ధిఖి గా మార్చుకున్నాడు. రంజాన్ మహమ్మద్ దంపతులు గత కొన్నేళ్లుగా పెరియకులం జిల్లాలోని వడకరై లోని వీఆర్పీ నాయుడు వీధిలో నివాసం ఉంటున్నారు. మహ్మద్ అబూబకర్ సిద్ధిఖీ అదే ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి కిరాణా దుకాణం నడుపుతూ వ్యాపారం చేస్తున్నాడు. మోహమ్మద్, రంజాన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు సంవత్సరాల నుంచి రంజాన్, మోహమ్మద్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో ఇంట్లోనే ఉన్న రంజాన్ కాసేపు మాట్లాడలేక ఊపిరి పీల్చుకోలేక స్పృహతప్పి పడిపోయింది. కుమార్తెలు కేకలు వెయ్యడంతో ఇరుగుపొరుగు వారు, బంధువులు వచ్చి చూసే సరికి రంజాన్ మృతి చెందినట్లు తెలిసింది.
తరువాత ఇంటికి వెళ్లిన మోహమ్మద్ ఇంటి ముందు పెండాల్ వేసి అతని భార్య రంజాన్ అంత్యక్రియలు చెయ్యడానికి ఏర్పాట్లు చేశాడు. నా భార్య అనారోగ్యంతో చనిపోయిందని చుట్టుపక్కల వాళ్లను, బంధువులను మోహమ్మద్ నమ్మించాడు. రంజాన్ ను ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రంజాన్ తల్లి ఫాతిమా (70) తన కుమార్తె మృతిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయని పెరియకుళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మోహమ్మద్ అబూబకర్ సిద్ధిఖీని పోలీసులు విచారించగా పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ అబూబకర్ సిద్ధిఖీకి కొంతమంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆ విషయం రంజాన్ తెలిసిపోవడంతో ఆమె ఖండించిందని, ఇదే విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు అన్నారు, అంగడికి వచ్చి వెలుతున్న మహిళలతో కూడా మోహమ్మద్ అలియాస్ వడివేలు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు అన్నారు.