కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదన్న NIA !

Home >>> క్రైమ్ > కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదన్న NIA !

news-details

కోడి కత్తి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని, క్షుణ్ణంగా దర్యాప్తు చేసినందున మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోర్టుకు స్పష్టంచేశారు. ఈ కేసుకు సంబంధించి రెండో రోజైన బుధవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఇన్ కెమెరా పద్ధతిలో విచారణ సాగింది. ఈ అంశంపై లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ చేసిన అభ్యర్థనపై తాము ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని ఎన్ఐఏ తరపు న్యాయవాది విశాల్ గౌతమ్ కోర్టుకు నివేదించారు. 'ఘటనపై దర్యాప్తు ముగిశాక, కేసు విచారణ ప్రారంభమైన దశలో హఠాత్తుగా మళ్లీ లోతైన దర్యాప్తు డిమాండ్ తీసుకురావడం సహేతుకం కాదు.

ఘటనకు సంబంధించి సాక్షాలను పకడ్బందీగా సేకరించాం. వీటి ప్రకారం శ్రీనివాసరావు ఒక్కడే నిందితుడని తేలింది. కుట్రకోణం ఉన్నట్లు ఎక్కడ ఆధారాలు లభించలేదు' అని ఆయన వాదించారు. నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం సైతం లోతైన దర్యాప్తు కోసం వేసిన పిటీషన్ ను అనుమతించొద్దని కోరారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిందితుడు ఐదేళ్లుగా రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్నారన్నారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశిస్తే నిందితుడికి న్యాయం ఆలస్యం అవుతుందన్నారు.

You can share this post!