Home >>> క్రైమ్ > ఫోన్ తీసారని మందలిస్తే ట్రిపుల్ ఐటి విద్యార్ధిని ఆత్మహత్య
కడప జిల్లా ఇడుపలపాయ ఐఐటి విషాదం చోటు చేసుకుంది. ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న ఒంగోలు క్యాంపస్ లో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న జమీషాఖురేషి అనే విద్యార్దిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూం లో ఉన్న వాటర్ పైపుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన విద్యార్దిని ప్రకాశం జిల్లా చీరాల కు చెందిన అమ్మాయిగా గుర్తించారు.
స్థానిక విద్యార్థుల సమాచారంతో త్రిబుల్ ఐటీ అధికారులకు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అమ్మాయి మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్ విద్యార్థిని మొబైల్ కళాశాల క్యాంటీన్ వద్ద పోవడంతో మృతి చెందిన విద్యార్దిపై నెపం నెట్టారని మొబైల్ ఫోన్ ను మృతి చెందిన అమ్మాయి తీసిందని త్రిబుల్ ఐటీ అధికారులు విద్యార్థిని మందలించారని అందుకే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.