Home >>> ఆంధ్రప్రదేశ్ > జగన్ పై రాయి అతనే విసిరాడా...? జగన్ పర్యటనకు వెళ్తే ఎంతిస్తారు...!
సీఎం జగన్‌పై రాయి దాడి కేసు దర్యాప్తుకు 8 బృందాలు నియమించినట్టుగా తెలుస్తోంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసుల అదుపులో ఐదుగురు అనుమానితులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ యువకుడు రాయి విసిరినట్లు గుర్తించిన పోలీసులు దాడి వెనుక కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.
యాత్రలో వీడియోలను పరిశీలించడం ద్వారా నిందితుడ్ని గుర్తించారు. సతీష్ అనే యువకుడు జగన్‍పై రాయి విసిరినట్లు తెలిసింది. ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‍లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జగన్ యాత్రలో పాల్గొనేందుకు, ఇతర యువకులతో పాటు సతీష్ కూడా వచ్చాడు. క్వార్టర్ బాటిల్, రూ.350 ఇస్తామని చెప్పి మద్యం ఇచ్చి, డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారని పోలీసులకు సతీష్ చెప్పడం గమనార్హం. విచారణపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.