Home >>> హెల్త్ > మూర్ఛ(ఫిట్స్) .. ఆ పేరు వింటేనే భయపడుతున్నారా??? దాని గురించి పూర్తి గా తెలుసుకుందామా..!!!!!!
మూర్ఛ వ్యాధి (ఫిట్స్) అనగానే కంగారు పడిపోతారు. ఈ వ్యాధి పట్ల నెలకొని ఉన్న అపోహలు, అవగాహనా లోపాలే ఈ వ్యాధి పట్ల అనవసరపు భయాలకు ప్రధాన కారణం.
నాన్‌వెజ్, గుడ్లు, బెండకాయ, వంకాయలు తినడం వల్ల ఫిట్స్ రావు. ఇవన్నీ అపోహలు మాత్రమే! ఫిట్స్‌కూ ఆహారానికీ ఎటువంటి సంబంధం లేదు.
మూర్ఛ వ్యాధి వలన శరీరంలోని అవయవాలకు ఎటువంటి హని జరగదు. మధుమేహం, అధిక రక్తపోటుల్లా శరీరంలోని మరే ఇతర అవయవానికీ హాని తలపెట్టవు.సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నుండి తప్పించుకోవచ్చు.
పిల్లల్లో వచ్చే ఒక రకం మూర్చకి మందులకు బదులుగా కీటోజెనిక్ డైట్ సత్ఫలితాన్ని ఇస్తుంది. గ్లూట్1 రిసెప్టార్ లోపం వల్ల తలెత్తే ఎపిలెస్సీకి కూడా మందుల కంటే కీటోజెనిక్ డైట్ బాగా పని చేస్తుంది.
జన్యుపరమైన సమస్యలతో...
@ సాధారణ మెదడు వల్ల, అసాధారణ మెదడు వల్ల ఇలా రెండు రకాలుగా పుట్టుకతోనే పిల్లలు ఫిట్స్ భారిన పడే అవకాశం ఉంది. జన్యుసంబంధ ఫిట్స్ వచ్చే వాళ్లలో సైతం మెదడు సాధారణంగానే ఉంటుంది.
@ మెదడులో ఒక చోట ఉత్పత్తి అయిన న్యూరాన్లు ఇంకో చోటకు వలస వెళ్తూ ఉంటాయి. ఆ వలసలో సమస్య ఏర్పడి, మార్గమధ్యంలో ఆగిపోయినా, వాటి గమ్య స్థానం మారిపోయినా ఫోకల్ కార్టికల్ డిస్‌ప్లేసియా తలెత్తుతుంది. ఎపిలిప్సీకి ఇదే అత్యంత సాధారణమైన కారణం.
@ న్యూరోసిస్టి సర్కోసిస్: కలుషిత ఆహారం ద్వారా టేప్ వార్మ్స్ (పంది విసర్జకాల్లో ఉండే సూక్ష్మజీవి) మెదడులోకి చేరుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తి, ఫిట్స్‌కు దారి తీయవచ్చు.
@ క్షయకు సంబంధించిన ట్యుబర్క్యులో గ్రాన్యులోమాస్ మెదడులోకి చేరినప్పుడు కూడా ఫిట్స్ తలెత్తవచ్చు. అయితే మెదడు టిబిలో మెనింగ్జయిటిస్ ఎన్‌సెఫలైటిస్, ట్యుబర్క్యులోమా అనే రెండు రకాలుంటాయి. ట్యుబర్క్యులోమాలో మెదడులో చిన్న గడ్డ ఏర్పడుతుంది. దీని వల్ల ఫిట్స్ తలెత్తుతాయి.
@ ప్రమాదాల్లో తలకు దెబ్బ తగలడం వల్ల, మెదడులో మచ్చలు ఏర్పడి ఎపిలెప్సీకి దారి తీస్తూ ఉంటాయి.
మూర్ఛ (ఫిట్స్)కి చికిత్స చేసే విధానాలు.....
$ జన్యుపరమైన ఎపిలెప్సీకి ప్రభావితమైన జన్యువు ఆధారంగా సరైన, ప్రభావవంతమైన మందులను వైద్యులు ఎంచుకుంటారు. న్యూరో సిస్టి సర్కోసిస్, ట్యుబర్క్యులోమా, స్కార్ ఎపిలెప్సీ, ఫోకల్ కార్టికల్ డిస్‌ప్లేసియా మొదలైన మిగతా ఎపిలెప్సీలన్నీ ఫోకల్ ఎపిలెప్సీ కోవలోకి వస్తాయి. ఈ కోవకు చెందిన ఎపిలెప్సీ మందులు జెనెటిక్ ఎపిలెప్సీకి భిన్నంగా ఉంటాయి.
$ ఎక్కువగా ఫిట్స్‌కు గురయ్యే వారికి ఇంజెక్షన్లు అవసరమవుతాయి. మిగతా ఫిట్స్‌కు నోటి మాత్రలు సరిపోతాయి.
మూర్ఛకి శాశ్వత చికిత్స లేదు కాబట్టి, మందులను క్రమం తప్పకుండా జీవితాంతం వాడుకోవలసి ఉంటుంది. మందు తీసుకున్న రోజు మూర్ఛ రాకుండా ఉంటుంది.
* ఫిట్స్ వచ్చిన వ్యక్తి చేతిలో తాళాలు ఉంచడమనే అలవాటు ఒక సంప్రదాయంగా మారిపోయింది. కానీ నిజానికి ఇలా చేసినా, చేయకపోయినా ఫిట్స్ రెండు నిమిషాల్లో తగ్గిపోతాయి. నిజానికి ఆ సమయంలో వెల్లకిలా పడిపోతారు కాబట్టి లాలాజలం, దంతాల మధ్య నలిగిన నాలుక నుంచి వెలువడే రక్తస్రావం ఊపిరితిత్తుల్లోకి చేరుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫిట్స్ వచ్చిన వ్యక్తికి కుడి లేదా ఎడమ వైపుకు తిప్పాలి. అలాగే కదిలే అవయవాలను బలవంతంగా పట్టుకుని కదలికలను నియంత్రించే ప్రయత్నం చేయకూడదు. అయితే కదిలే కాళ్లూ, చేతులూ పక్కనున్న వేటికీ తగిలి, గాయపడకుండా చూడాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫిట్స్ సమస్య ఉండి మందులు వాడుకునే పది మంది వ్యక్తుల్లో ఎనిమిది మందు వ్యక్తులు ఫిట్స్ మీద చక్కని నియంత్రణ సాధించగలుగుతారు. ఫిట్స్ సమస్య తో బాధ పడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....
# క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి.
# రోజుకు కనీసం ఆరు గంటలపాటైనా నిద్రపోవాలి.
# మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలి.
# ప్రకాశవంతమైన వెలుగుకు దూరంగా ఉండాలి.
# విపరీతమైన శబ్దాలకు దూరంగా ఉండాలి.
# కుటుంబ సభ్యులు కూడా ఫిట్స్ ఉన్న వ్యక్తి క్రమం తప్పక మందులు వాడేలా చూసుకోవాలి.