Home >>> హెల్త్ > అన్నం వండే ముందు బియ్యం ఎందుకు కడుగుతారో తెలుసా?
భారతదేశంలో చాలా మంది అన్నం తింటారు. కొంతమంది మూడు పూటలు అన్నం తింటే మరికొంతమంది రెండు పూటలు తింటుంటారు.
అందరూ అన్నం వండే ముందు బియ్యాన్ని తప్పనిసరిగా కడుగుతారు. కొందరు ఒకసారి రెండుసార్లు కడిగితే మరికొంతమంది నాలుగైదుసార్లు కడుగుతుంటారు. అయితే ఇలా అన్నం వండడానికి ముందు బియ్యాన్ని ఎందుకు కడుగుతారో అంటే బియ్యం శుభ్రం చేయటానికి అని చెప్తారు.
కానీ అన్నం వండే ముందు బియ్యం కడగటానికి శాస్త్రీయ కారణం ఏమిటో తెలుసుకుందామా......
కొంతమంది బియ్యంలో వుండే రాళ్లు, దుమ్ము, ఇతర సూక్ష్మజీవులు పోవడానికి కడుగుతుంటారు. అయితే రైస్ కడగడం వల్ల అందులోని బయో యాక్సెసిబుల్ ఆర్సెనిక్ 90 శాతం తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం.
బియ్యం కడిగితే ఇనుము, జింకు, రాగి వంటి పోషకాలు కూడా బయటకు పోతాయని నిపుణులు చెబుతున్నారు.
దీనికి కారణం పిండిపదార్ధాలు కాదు. వండేటప్పుడు బియ్యం కడిగిన సమయంలో అమిలో పెక్టిన్ రిలీజ్ వల్ల బియ్యం జిగురు గా ఉంటాయి.
కొన్ని రకాల బియ్యం, గ్లూటినస్ రైస్, మీడియం గ్రెయిన్ రైస్, జాస్మిన్ రైస్ అంటుకునే పొరను కలిగి ఉంటాయి. ఇది స్టార్చ్ నుండి రాదు. వంట సమయంలో విడుదలయ్యే ‘అమిలోపాక్టాన్’ వల్ల ఈ జిగురు ఏర్పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. గ్లూటినస్ బియ్యం మరింత జిగటగా మరియు గట్టిగా ఉంటుంది. బియ్యం కడిగితే శుద్ధి అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది కూడా కొంత వరకు నిజమే అయినప్పటికీ.. బియ్యంపై దుమ్ము, ధూళితో పాటు కొద్దిపాటి లోహపు పొడి కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా సురక్షితం. అందుకే బియ్యం కడిగితే దానిపై ఉండే 90 శాతం క్రిములు తొలగిపోతాయని అధ్యయనం చెబుతోంది. బియ్యం కడిగితే శుద్ధి అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది కూడా కొంత వరకు నిజమే అయినప్పటికీ.. బియ్యంపై దుమ్ము, ధూళితో పాటు కొద్దిపాటి లోహపు పొడి కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా సురక్షితం. అందుకే బియ్యం కడిగితే దానిపై ఉండే 90 శాతం క్రిములు తొలగిపోతాయని అధ్యయనం చెబుతోంది.