Home >>> హెల్త్ > టీ తాగడానికి ముందు లేదా తాగిన తరువాత నీళ్లు తాగవచ్చా?
టీ తాగే ముందు, తర్వాత ప్రజలు నీళ్లను సాధారణంగా తాగుతూ ఉంటారు, అయితే కొందరు ఈ పద్ధతి హానికరమని నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ, టీ తాగడానికి ముందు నీరు తాగటం నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎందుకంటే టీ 6 పీహెచ్ విలువ కలిగి ఉంటుంది, మనం తాగే టీ లో ఉండే ఆమ్లా గుణాలు మన ప్రేగులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి టీ తాగడానికి ముందుగా నీరు తాగడం వల్ల పేగులు హైడ్రేట్ గా ఉంటాయి.
ఇది టీలోని యాసిడ్ మన ప్రేగులకు ఎటువంటి హాని కలిగించకుండా నిరోధిస్తుంది. ఎసిడిటీ, డీహైడ్రేషన్, అల్సర్ మరియు దంత క్షయాన్ని నివారించడం వంటి అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నందున సాధారణ నీటిపై వెచ్చని నీరు టీ తాగడానికి ముందు తాగవచ్చు. టీ తాగడానికి ముందు నీళ్లు తాగచ్చుగా అని వెంటనే తాగకూడదు, నీళ్లు తాగిన 10-15 నిమిషాల తరువాత టీ తాగవచ్చు.
మరోవైపు టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు. టీ తాగిన తర్వాత నీళ్ళే కాదు మరే ఇతర ద్రవాన్ని తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే ఇది కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, గొంతు నొప్పికి కారణంగా మారుతుంది.