మరమరాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా????

Home >>> హెల్త్ > మరమరాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా????

news-details

మరమరాలు ఈ పేరు తెలియని వారు ఉండరు.ఇవి కనిపిస్తే చాలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు  నోట్లే వేసుకోకుండా ఉండలేరు. వీటిని బొరుగులు, ముర్ముర్లు, మురీలు అని వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తుంటారు. మరమరాలతో లడ్డూలు, భేల్ పూరి, స్వీట్స్‌ ఇలా ఏమి చేసినా టేస్ట్ అదిరిపోతుంది. ఇది బెస్ట్‌ టైమ్‌ పాస్‌ ఫుడ్‌ అని  మాత్రమే అందరికీ తెలుసు.కానీ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

       మరమరాలలో విటమిన్‌ డి, విటమిన్‌ బి, క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది చాలా తేలికైన ఆహారం, దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.  వీటిని రోజూ స్నాక్‌గా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 

ఆ ప్రయోజనాలు ఎంటో చూద్దామా....

@ బరువు తగ్గేవారికి మరమరాలు బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పొచ్చు. మరమరాలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. పైబర్‌ ఎక్కువ సమయం ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిళ్లు ఎక్కువగా తీసుకోకుండా నియంత్రిస్తుంది. జంక్ ఫుడ్‌కు బదులుగా మరమరాలు తీసుకుంటే బరువు కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

@అధిక రక్తపోటు, గుండె సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడే వాళ్లు మరమరాలను తీసుకుంటే మంచిది.మరమరాల్లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి బ్లడ్‌ ప్రెజర్‌ను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి.  మరమరాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

@ఎముకలను బలంగా ఉంచడానికి మరమరాలు తినాలి. మరమరాలలో విటమిన్‌ డి, బిలతో పాటు కాల్షియం, ఐరన్‌, థయామిన్, రిబోఫ్లావిన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి.

@ మరమరాలు పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. మరమరాలలోని పోషకాలు పిల్లల మెదడును యాక్టివ్‌ చేస్తాయి. 

@మరమరాలు చాలా తేలికగా  జీర్ణమవుతాయి.  వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు, పేగులలో ఆహార కణాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగులలో జీర్ణ ఆమ్లాల స్రావాన్ని ప్రేరేపిస్తుంది, పేగుల ద్వారా అవసరమైన పోషకాలను గ్రహించడాన్ని పెంచుతుంది. మరమరాలు తరచుగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, విరేచనాలు, అపానవాయువు, కడుపు పుండు, మలబద్ధకం వంటి జీర్ణసమస్యలు నయం అవుతాయి.

@ పిల్లల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి వారి ఆహారంలో మరమరాలు చేర్చితే ఫలితం ఉంటుంది. వీటిలోని ఐరన్‌ కెంటెంట్ రక్తాన్ని వృద్ధి చేస్తుంది.      

@ మరమరాలలో మినరల్స్‌, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.కడుపు లో  ఇన్ఫెక్షన్లు, ఫ్లూ, జలుబు, గొంతు నొప్పి, లంగ్‌ ఇన్ఫెక్షన్స్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉండటం వలన  మరమరాలను తరచుగా  తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

You can share this post!