పాక్ క్రికెట్ కు మళ్ళీ ఫిక్సింగ్ మరక, కెప్టెన్ రియాక్షన్ ఇదే

Home >>> క్రీడలు > పాక్ క్రికెట్ కు మళ్ళీ ఫిక్సింగ్ మరక, కెప్టెన్ రియాక్షన్ ఇదే

news-details

పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టిపారేశాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించాడు. టి20 ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీడియా ప్రశ్నించగా... మసూద్ సమాధానం ఇచ్చాడు. 

మీరు మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదాన్ని వాడారు కాబట్టి చెప్తున్నాను... ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ లో ఉన్న ఆటగాళ్ళ నిజాయితీని ఎవరూ ప్రశ్నించాలని తాను అనుకోవడం లేదు అన్నాడు. ఇది అసలు నేను ఒప్పుకోను అన్నాడు. రెండవది, ప్రపంచ కప్ అయిపొయింది... రాబోయే ప్రపంచ కప్ కోసం సిద్దం కావాలి. మా ఆటగాళ్లందరూ పాకిస్థాన్‌కు మ్యాచ్‌లు గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని నేను హామీ ఇవ్వగలను. గెలుపు ఓటములు సహజం. ఓడినప్పుడు మేము కూడా బాధపడతాం అన్నాడు మసూద్. కాగా క్రికెట్ లో కొన్ని దశాబ్దాల నుంచి పాకిస్తాన్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది.

You can share this post!