Home >>> క్రీడలు > రోహిత్ ఖాతాలో “భారీ” రికార్డు...!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 300 సిక్సర్లు బాదిన మొదటి భారత ఓపెనర్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సులు కొట్టిన మూడవ ఆటగాడు రోహిత్. ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. కాని రోహిత్ బ్యాటింగ్ లో ఆకట్టుకున్నాడు. రోహిత్ కేవలం 44 బంతుల్లో 64 పరుగులు చేసాడు. ఇందులో నాలుగు సిక్సులు ఉన్నాయి.
ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్‌లో 177.. మొత్తం ఓపెనర్ గా 302 సిక్సులు కొట్టాడు. ఇక క్రిస్ గేల్ 280 మ్యాచ్‌ల్లో 328 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ ఫాం చూస్తే ఆ రికార్డు త్వరలోనే బద్దలయ్యే అవకాశం కనపడుతుంది. ప్రస్తుత శ్రీలంక కోచ్, మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య 388 వన్డేల్లో 263 సిక్సర్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ వన్డేల్లో 55 యావరేజ్ తో 8,801 పరుగులు సాధించగా 29 సెంచరీలు మరియు 55 అర్ధశతకాలు బాదాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల జాబితాలో రోహిత్ 264 మ్యాచ్‌ల్లో 330 సిక్సర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. 398 మ్యాచ్‌లలో 351 సిక్సర్లతో పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది అగ్ర స్థానంలో ఉన్నాడు.