కళ్ళ జోడు ఎందుకు పెట్టుకోలేదో చెప్పిన ఒలంపిక్ షూటర్...!

Home >>> క్రీడలు > కళ్ళ జోడు ఎందుకు పెట్టుకోలేదో చెప్పిన ఒలంపిక్ షూటర్...!

news-details

పారిస్ ఒలంపిక్స్ లో ఇప్పుడు యూసఫ్ అనే పేరు మార్మోగిపోతుంది. మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఏ విధమిన అదనపు పరికరాలు లేకుండా షూట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంది. బయట నుంచి వచ్చే సౌండ్స్ ని కంట్రోల్ చేయడానికి మాత్రమే చిన్న ఇయర్ ప్లగ్ లు పెట్టుకున్నాడు. కాని ఇతర ఆటగాళ్ళు ధరించే స్పెషలిస్ట్ కళ్లజోడు అలాగే హెడ్‌ఫోన్‌లను పెట్టుకోవడానికి ఆసక్తి చూపించలేదు. 

సాధారణంగా దృష్టి మరల్చకుండా ఉండేందుకు ఒక కన్నుపై కవర్ కూడా పెడతారు. ఇది గురి పెట్టి షూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాని యూసఫ్ మాత్రం తన రోజువారీ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ మాత్రమే ధరించాడు.దీనిపై అతను తమ దేశ మీడియాకు వివరించాడు. టర్కిష్ మీడియాతో మాట్లాడుతూ నాకు ఆ పరికరాలు ఎప్పుడూ అవసరం లేదు అన్నాడు. నేను సహజమైన షూటర్‌ని అని అందుకే ఇతరుల మాదిరిగా తాను వేరే వస్తువులు వాడను అన్నాడు. యూసఫ్ సిల్వర్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే.

You can share this post!