Home >>> హెల్త్ > ఈతపండ్లు ఆరోగ్యానికి మంచివా???
ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో నే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, ప్రకృతిలో లభించే ప్రతి పండూ దేని ప్రత్యేకత దానిదే. అలాంటి పండ్లలో ఈతపండ్లు ఒకటి.
వేసవి లో మాత్రమే దొరికే ఈత పండును పేదింటి కర్జూరం అంటారు. కర్జూరంలో ఉండే పోషకాలన్నీ ఈత పండులో ఉన్నాయి. ఈత పండ్లు పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.
ఈతపండ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసా!!!!!!
@ ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ప్రక్టోజ్ లు తక్షణ శక్తినిస్తాయి.
@ ఈత పండ్లు వేసవిలో వచ్చే అలసటను దూరం చేసి శక్తినిస్తాయి.
@ ఈత పండ్లు ఉదయం వేళలో తింటే జీర్ణశక్తి చాలా బాగుంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి.
@ ఈత పండ్లలో ఐరన్ సంవృద్ధిగా ఉంటుంది. దీంతో రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
@ వేసవిలో దొరికే ఈత పండ్లను తింటే వేడి తగ్గుతుంది.
@ మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు ఈత పండ్లు ఎంతగానో సహాయపడుతాయి.