Home >>> బిజినెస్ > డెబిట్ కార్డు మీద ఉండే 16 అంకెల సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ?
ప్రస్తుతం చాలా మంది డెబిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. డెబిట్ కార్డు అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఈ కార్డుపైనే ఆధారపడుతుంటారు. ప్రతి కార్డులో 16 నెంబర్లు ఉంటాయి. అందరికీ ఇవి చాలా భిన్నంగా కనిపిస్తాయి. ఆ సంఖ్యకి ప్రత్యేక అర్థముంది. కార్డులోని మొదటి 6 నెంబర్లు బ్యాంకు యొక్క గుర్తింపు సంఖ్య కాగా.. మిగిలిన 10 నెంబన్లు యూనిక్ అకౌంట్ నెంబర్. అంతేకాదు.. కార్డుకు ప్రత్యేక హోలో గ్రామ్ ఉంది. నకిలీ చేయడం చాలా కష్టం. కార్డు చెల్లుబాటు కూడా కార్డుపై వ్రాయబడి ఉంటుంది.
మొదటి సంఖ్య మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైయర్ అంటే.. బ్యాంకు, పెట్రోలియం లేదా ఏదైనా పరిశ్రమను ఆ సంఖ్యతో అర్థం చేసుకోవచ్చు. కార్డులోని మొదటి 6 అంకెలు కార్డును జారీ చేసిన కంపెనీని సూచిస్తాయి. దీనినే IIN లేదా ఇష్యూయర్ ఐడంటిఫికేషన్ నెంబర్ అంటారు. కార్డుపై ఉండే.. 16 నెంబర్లలో 7వ నుంచి 15వ సంఖ్య వాస్తవానికి కస్టమర్ బ్యాంకు ఖాతాకు సంబంధించింది. చింతించకండి.. దీని నుంచి కస్టమర్ ఖాతా నెంబర్ ఎవ్వరూ తెలుసుకోలేరు. 16వ లేదా చివరి సంఖ్య మిగిలి ఉంది. దీనిని చెక్ డిజిట్ అంటారు. ఈ సంఖ్య కార్డు చెల్లుబాటులో ఉందో లేదో సూచిస్తుంది. ఈ సంఖ్య వైపు భద్రత పరంగా చాలా ముఖ్యమైనది. ఖాతా నెంబర్ కార్డు నెంబర్ తో సరిపోలుతుందనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి.