Home >>> బిజినెస్ > జూలైలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు ?
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. .జూలై నెలలో బ్యాంకులో సగం రోజులే పని చేయనున్నాయి. ఎందుకంటే జూలైలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులు ఉన్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు జాతీయ సెలవు దినాలు ఇతర సెలవు దినాలు కలుపుకుంటే మిగిలింది 15 రోజులే. కాబట్టి జూలైలో బ్యాంకులు 15 రోజులే పని చేయనున్నాయి.
ఇందులో 5 ఆదివారాలు, 2 శనివారాల రూపంలో వారాంతపు సెలవులే 7 ఉండనున్నాయి. మిగిలిన 8 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు కారణాలతో బ్యాంకులు పనిచేయవు. కస్టమర్లు ఇది గమనించడం మంచిది. అయితే బ్యాంకులు పని చేయకపోయినప్పటికీ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయి. కాగా, బ్యాంకులు పనిచేయని తేదీలు ఇలా ఉన్నాయి. 2, 5, 6, 8, 9, 11, 13, 16, 17, 21, 22, 23, 28, 29, 30 తేదీలలో బ్యాంకులు పనిచేయవు.