Home >>> క్రైమ్ > వివేకా కేసులో ట్విస్ట్..దస్తగిరి, ఆయన భార్య షబానాపై కేసు
వివేకా హత్య కేసులో ట్విస్ట్..చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి, ఆయన భార్య షబానాపై కడప జిల్లా పులివెందులలో కేసు నమోదు అయింది. మైనర్ బాలుడిని దస్తగిరి, షబానా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. దీంతో పోలీసులకు మైనర్ బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దస్తగిరి ఆయన భార్య షబానాపై కిడ్నాప్, దాడి, బలవంతంగా నిర్బంధంపై కేసు నమోదు చేశారు. కాగా, పులివెందుల జయమ్మ కాలనీలో నివాసం ఉంటున్న కుల్లాయమ్మ దంపతులకు గతంలో దస్తగిరి రూ.40 వేలు అప్పు ఇచ్చారు.
ఇందుకు ఇంటిపత్రాన్ని పూచికత్తుగా పెట్టారు. ప్రతివారం వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే రెండు వారాలుగా కుల్లాయమ్మ దంపతులు వడ్డీ చెల్లించడం లేదు.. దీంతో కుల్లాయమ్మ కుమారుడు వల్లిని దస్తగిరి తన ఇంట్లో నిర్బంధించారు. ఈ మేరకు కుల్లాయమ్మకి పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి దస్తగిరి ఇంట్లో ఉన్న బాలుడిని విడిపించారు. వైద్య పరీక్షలు అనంతరం కుల్లాయమ్మ దంపతులకు బాలుడిని అప్పగించారు. తాజాగా దస్తగిరితో పాటు ఆయన భార్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.