ఉరివేసుకొని తాడిపత్రి పట్టణ సీఐ ఆత్మహత్య

Home >>> క్రైమ్ > ఉరివేసుకొని తాడిపత్రి పట్టణ సీఐ ఆత్మహత్య

news-details

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గత తొమ్మిది నెలలుగా ఆనందరావు తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సిపిఐ కాలనీలోని అద్దె ఇంట్లో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది.

 

గత కొన్ని రోజులుగా భార్య అనురాధతో సిఐకు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత ఇంట్లోనే సిఐ ఉరి వేసుకున్నారు. గత మూడు నెలలుగా పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. సిఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్ లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి. సీఐకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనందరావు ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.

You can share this post!