Home >>> పాలిటిక్స్ > కన్నడ ఎలక్షన్.... తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పందాలు..!?
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరివీ... ఏ పార్టీ గెలుస్తుంది.. అధికారం ఏ పార్టీది.... ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నానికి అధికారం ఏ పార్టీదనేది ఓ క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే జోరుగా పందాలు వేస్తున్నారు. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది... ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారు... ఏ అభ్యర్థికి మెజారిటీ ఎంత అనే అంశాలపై భారీగా బెట్టింగ్ నడుస్తోంది.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 50 మిలియన్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కన్నడ నాట వరుసగా రెండో సారి విజయం సాధించేందుకు ఇప్పటికే బీజేపీ నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. అనూహ్యంగా ప్రధాని మోదీ అయితే... ఏకంగా 24 గంటల పాటు బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తమదైన మేనిఫెస్టోలతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశాయి ప్రధాన పార్టీలు.
అయితే కర్ణాటకలో దాదాపు 60 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం స్పష్టంగా ఉంది. 60 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది తెలుగు వారే. ఈ నేపథ్యంలో తెలుగు వారి ఓట్ల కోసం కన్నడ నేతలు భారీగానే తాయిలాలు ప్రకటించారు. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగు నేతలు అక్కడే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంపై తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ జరుగుతోంది. కన్నడ ఎన్నికల ఫలితాలు త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికలపైన స్పష్టంగా ప్రభావం చూపనున్నాయి. అలాగే అనంతపురం, కర్నూరు జిల్లాల సరిహద్దు నియోజకవర్గాలపై కూడా కన్నడ రాజకీయాల ప్రభావం ఉంటుంది. దీంతో కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నేతల్లో బెట్టింగ్ కు కారణమైంది.