Home >>> పాలిటిక్స్ > మీరు ఐ ఫోన్ వాడుతున్నారా.. మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఒక వార్త రాజకీయ నాయకులను, మీడియా రంగాన్ని భయపెడుతుంది. తాజాగా యాపిల్ సంస్థ తమ వినియోగదారులకు చేసిన హెచ్చరిక కలవరపెడుతుంది. పెగాసస్ తరహా స్పై వేర్ దాడులు జరగవచ్చు అని తమ సందేశంలో యాపిల్ పేర్కొంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, విలేఖర్లు సహా పలువురిపై ఈ దాడులు జరిగే అవకాశం ఉందని యాపిల్ పేర్కొంది.
ఎన్నికల సమయంలో ఈ దాడులకు అవకాశాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మెర్సినరి అనే స్పై వేర్ తో ఈ దాడులు చేస్తారని ఇవి చాలా సంక్లీష్టంగా ఉంటాయని పేర్కొంది. సాధారణంగా జరిగే సైబర్ క్రైం దాడులు, కన్జూమర్ మాల్ వేర్ కంటే ఈ దాడులు చాలా భిన్నంగా ఉంటాయని, అసాధారణ వనరులు ఉపయోగించి తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు, వారి పరికరాలపై దాడులు చేస్తారని పేర్కొంది.
దీని వలన మిలియన్ డాలర్ల నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది. వాట్సాప్ లో మిస్డ్ కాల్ తోనే మొబైల్ ను కంట్రోల్ చేసుకోవచ్చు అని యాపిల్ పేర్కొంది. ఫోన్ లో లాక్ డౌన్ మోడ్ వాడటం ద్వారా దీని నుంచి బయటపడవచ్చ్హు అని పేర్కొంది యాపిల్. ఇంటర్నెట్ థ్రెట్, ఇన్వెస్టిగేషన్, ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ దాడులను గుర్తించడానికి అవకాశం ఉందని తెలిపింది.