బ్రిటన్ బీచ్ లో మృతి చెందిన హైదరాబాద్ యువతి

Home >>> క్రైమ్ > బ్రిటన్ బీచ్ లో మృతి చెందిన హైదరాబాద్ యువతి

news-details

హైదరాబాద్ లోని సైదాబాద్ లక్ష్మీ నగర్ కాలనీ కి చెందిన విద్యార్థి సాయి తేజస్వి యూ కె లో ప్రమాదం లో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి తేజస్వి యూకేలోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చదువుతోంది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం , ఆమె "ఏప్రిల్ 11న బ్రైటన్ బీచ్ వద్ద అలలలో చిక్కుకుని మృతి చెందిందని , అప్పటి నుండి ఆమె మృతదేహం UK ఆసుపత్రిలోనే ఉందని...సాయి తేజస్విని లాంగ్ వీకెండ్ కి వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

 

సాయి తేజస్విని అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని , సాయి తేజస్వినితో ఎవరెవరు ఉన్నారని , ఆమెకు ఈత రాదా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.ప్రక్రియను పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.గారాల కూతురు ఇలా హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

You can share this post!