Home >>> పాలిటిక్స్ > దస్తగిరికి ప్రాణహాని, తెలంగాణా హైకోర్ట్ ఏం చేయబోతుంది...?
గత ఎన్నికలకు ముందు సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ, పిటిషనర్ తరుపు న్యాయవాది జడ శ్రావణ్ తన వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి తరుపు వాదనలు వినిపించిన ఆయన... దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.
తన తండ్రి పైన అవినాష్ అనుచరులు దాడి చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి , వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోరారు. దస్తగిరి కి ప్రాణా హానీ ఉందని సీబీఐ సైతం కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళింది. దస్తగిరి ప్రాణ హానీ ఉందని మీరు ఇప్పుడు ఎలా చెపుతున్నారు ? అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పై మీరు ఎందుకు సుప్రీంకోర్టు కి వెళ్ళలేదని సీబీఐ కి హైకోర్టు ఎదురు ప్రశ్నలు వేసింది. దీనికి స్పందించిన సిబిఐ సుప్రీం లో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపే వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టు వెళ్ళిందని గుర్తు చేసింది.
దీంతో మేము సునీత పిటిషన్ లో మేము కౌంటర్ దాఖలు చేశామని సిబిఐ పేర్కొనగా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐ కి నాంపల్లి కోర్ట్ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. తమకు ప్రాణాహనీ ఉందని సీబీఐ కి దస్తగిరి భార్య, దస్తగిరి ఫిర్యాదు చేసిన ఇంకా చర్యలు తీసుకోలేదని చెప్పగా... విట్నెస్ ప్రొటెక్షన్ రిపోర్ట్ వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది కోర్ట్.